పురస్కారాన్ని స్వీకరించిన సీఎండీ పృథ్వీతేజ్
ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్)కు మరో పురస్కారం లభించింది. ఇంధన రంగంలో విశేష సేవలందిస్తున్న సంస్థల్ని ఢల్లీిలో ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ నెల 22, 23వ తేదీల్లో ‘12వ ఇన్నోవేషన్ ఇంపాక్ట్ అవార్డ్స్’తో సత్కరించింది. విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు, నిరంతర విద్యుత్ అందించడంతో పాటు నూతన ఆవిష్కరణలతో ముందుకు వెళ్తున్న ఈపీడీసీఎల్‌కు ‘ఇన్నోవేషన్ విత్ ఇంపాక్ట్ లార్డ్ డిస్కమ్’ పేరిట జాతీయ అవార్డును ప్రదానం చేసింది. సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి ఈ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ ఉద్యోగులు పారదర్శకత, జవాబుదారీతనంతో పని చేయడం వల్లనే ఈ అవార్డు లభించిందని సంతోషం వ్యక్తం చేశారు.