సాలూరు నియోజకవర్గం సాలూరు, మక్కువ మండలాలోని వెంగళరాయ జలాశయంలో 3 లక్షల చేప పిల్లలను స్త్రీ శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విడుదల చేశారు. గిరిజన మత్స్యకారుల ఉపాధి పెంచి, ఆర్థికంగా ఆసరా కల్పించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయం అని మంత్రి అన్నారు. కార్యక్రమంలో ఫిషరీస్ శాఖ ఏడి,అధికారులు, మత్స్యకార సంఘ అధ్యక్షులు ఆదినారాయణ, సభ్యులు పాల్గొన్నారు.