ప్రపంచ శాంతి, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా సైకిల్ పై ప్రపంచ పర్యటన చేస్తున్న తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన ముత్తా సెల్వన్ శనివారం రాత్రి విజ యనగరం పార్లమెంట్ ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం చేరుకొన్నారు. ఆయన విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ ప్రపంచాన్ని చూడాలన్నదే తన ఆశయమని, మొక్కలు నాటడంపై అవగాహన కల్పిస్తున్నానని చెప్పారు. 1111 రోజుల్లో 34,200 కిలో మీటర్ల ప్రయాణం సాగించడమే తన లక్ష్యమని ఆయన వివరించారు. 2021 డిసెంబరు 28న తన ప్రయాణం ప్రారంభమయిందని, 2025లో ముగుస్తుందని చెప్పారు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్, నేపాల్లో కూడా పర్యటిస్తానని ఆయన తెలిపారు.
ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని చేపడుతున్న సెల్వన్ ను ఎంపీ అప్పలనాయుడు అభినందించారు.