శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం

సాలూరు పట్టణం  ఆటోనగర్ సబ్ స్టేషన్ పరిధి లో 11 కెవి పాలిటెక్నిక్ ఫీడరు, సాలూరు సబ్ స్టేషన్ పరిధి లో వున్న 11 కెవి బాగువలస ఫీడరు, సాలూరు టౌన్ ఫీడెర్ యొక్క మరమ్మతులు, లైన్ కి దగ్గరగా వున్న చెట్టు కొమ్మలు తొలగించే పనులు చేపడతాం అని విద్యుత్ శాఖ‌ ఈఈ గోపాలరావు నాయుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 7 గంటలు నుండి మధ్యాహ్నం 2 గంటలు వరకు చంద్రంపేట, పెదబోరబంద, బాగువలస, తాడిలోవ సాలూరు పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా,బంగారమ్మ కాలనీ, రామకోలని, బంగారమ్మ పేట, దండిగాం రోడ్, బొడ్డవలన, జైపూర్ రోడ్, బోసు బొమ్మ జంక్షన్ తదితర ప్రాంతాలు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుంది. అంతరాయానికి ప్రజలు సహకరించాలని కోరారు.

بيان

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *