కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు
కార్తీక పౌర్ణమి సందర్భంగా పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామికి వందలాది లీటర్ల పాలతో అభిషేకం నిర్వహించారు. ముందుగా పాలకావులతో ప్రధాన రహదారి, పలు వీధులలో అయ్యప్ప స్వాములు ఊరేగింపు నిర్వహించారు ఉత్సవ విగ్రహాలు, చిత్రపటాలను వాహనాలపై ఊరేగిస్తూ భజన గీతాలు భక్తిశ్రద్ధలతో ఆలపించారు. కావుళ్లలో పాలు వేసి, స్వాముల కాళ్లకు పిల్లలు పెద్దలు మొక్కుతూ ఆశీర్వాదం పొందారు. మహిళలు స్వాములకు మంగళ హారతులు ఇచ్చారు. ఊరేగింపులో భవానీ మాలదారణ చేసిన భక్తులు కూడా పాల్గొన్నారు