మత్స్యకారుల జీవన ప్రమాణాల మెరుగే ప్రభుత్వ ధ్యేయం: ఎంపీ కలిశెట్టి

శ్రీకాకుళం జిల్లా  మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీ  మాట్లాడుతూ.. మత్స్యకార సమాజానికి కీలకమైన కృషి చేయాల్సిన అవసరం ఉన్నట్లు పేర్కొన్నారు. మత్స్యకారుల పిల్లలు క్రీడా రంగంలో విశేష ప్రతిభ చూపగల సత్తా కలిగి ఉన్నారని, తమ ప్రతిభను వెలికితీయడానికి క్రీడా రంగంలో మరింత ప్రోత్సాహం అవసరమని సూచించారు. క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడటమే కాకుండా ప్రపంచ స్థాయిలో మత్స్యకార సమాజానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో సహాయపడతాయని తెలిపారు.
అలాగే, మత్స్యకారులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు వివిధ పథకాలు ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. మత్స్యకారుల కృషి సమాజానికి ఎంతో ప్రాముఖ్యమని, వారి అభివృద్ధికి కావలసిన అన్ని రకాల మద్దతు ప్రభుత్వం నుంచి అందుతుందని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కొంత మందికి   ఎంపీ  ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మత్స్యకార శాఖ ముఖ్య అధికారులు, కుట్టం లక్ష్మణ్ కుమార్ (డైరెక్టర్ అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్), పుచ్చ ఈశ్వరరావు, ( డైరెక్టర్ అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్), మైలుపల్లి నరసింహారావు డిఎఫ్సిఎస్ అధ్యక్షులు, మైలపల్లి త్రినాధ రావు, డీజీఎం ఆనందరావు, రణస్థలం దుమ్ము అశోక్ , కోరాడ వెంకటరమణ, సంచాం మాజీ సర్పంచ్ , కెవికె సైంటిస్ట్  బాలకృష్ణ , డిడి ఫిషరీస్ శ్రీకాకుళం శ్రీనివాస్,  పలాస, ఎఫ్ డి వో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *