చేతగాక చేయలేక జగన్ పై నిందలు: మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర

జనాభా ప్రాతిపదికన నిధులే కేటాయించలేదు దీనిని అద్భుతం అంటున్నారు..

అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడుతున్నారు

ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు బడ్జెట్లో నిధులే సక్రమంగా కేటాయించలేదు. దీనిని అద్భుతమైన బడ్జెట్ అంటూ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెబుతున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర విమర్శించారు.  ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు జనాభా ప్రాతిపదికన నిధులు ఇవ్వలేదు. బడ్జెట్లో నిధులే కేటాయించకపోతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తారు.? టిడిపి బడ్జెట్ తో ప్రజలకు ఒరిగేదేమీ లేదు. అందుకే దీనిని సూపర్ ప్లాప్ బడ్జెట్ అంటున్నారని రాజన్న దొర అన్నారు. శుక్రవారం ఆయన నివాసంలో వైకాపా నేతలతో సమావేశం అయ్యారు. గత ప్రభుత్వం ఐటీడీఏ లను పట్టించుకోలేదని పోడు పట్టాలు ఇవ్వలేదని అసెంబ్లీ సాక్షిగా గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి అబద్దాలాడారన్నారు. బడ్జెట్లో రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించక ముందే 2500 కోట్లతో రహదారులు నిర్మిస్తామని చెప్పారన్నారు. అసెంబ్లీలో సత్య దూరం అయిన ప్రకటన చేసిన మంత్రికి సభా హక్కుల నోటీసు ఇవ్వాలన్నారు.  కానీ వైకాపా సభ్యులు హాజరు కాకపోవడంతో స్పీకర్ దృష్టికి ఇది వెళ్లలేదన్నారు. రాష్ట్రంలో ఎస్సీలు 15% ఉండగా 6.28% నిధులు, ఎస్టీలు 6 శాతం ఉండగా 2.5 6% నిధులు కేటాయించి గొప్పలు చెప్పుకుంటున్నారు అన్నారు. సూపర్ సిక్స్ పథకాల హామీలను అమలు చేసేందుకు బడ్జెట్లో నిధులు ఏవి? వాటి సంగతి ఏంటని ప్రశ్నించారు? ఇచ్చిన హామీలకే దిక్కులేదు 2014 -19లో అమలు చేసిన పథకాలు కూడా మళ్లీ ఇస్తామని ఎలా చెబుతున్నారన్నారు.

*తల్లికి వందనం ఎప్పుడు..?*

తల్లికి వందనం పథకం ఎప్పుడు అమలు చేస్తారు 18 నుంచి 59 సంవత్సరాల మహిళలకు నెలకు 1500 రూపాయలు ఎప్పుడు అందిస్తారు అన్నారు. రైతులకు ఏడాదికి 20,000 ఇస్తామన్నారు. బడ్జెట్లో వాటికి నిధులే కేటాయించలేదు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి బడ్జెట్లో ఒక పైసా కూడా కేటాయించకపోవడం నిరుద్యోగులను మోసం చేయడం కాదా అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లను అందరిని ఈ ప్రభుత్వం దగా చేస్తుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు తుస్ అయిందన్నారు.

చేతగాక చేయలేక జగన్ పై నిందలా

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూటకో మాట రోజుకో నిర్ణయంతో సైకోలను తలపిస్తున్నారన్నారు. విజయనగరం జిల్లాలో గిరిజన వర్సిటీ ఎలా పెడతారు అని అప్పుడు ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మళ్లీ అక్కడే మంచిదని చెబుతున్నారు. ప్రభుత్వం వచ్చి ఐదు నెలలైనా చేయలేక చేతకాక జగన్ పై నిందలు వేస్తున్నారు. విద్యుత్ చార్జీలు 18 వేల కోట్ల భారం ప్రజలపై వేశారన్నారు. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అంగన్వాడీల జీతాలు పెంచాలి. పెంచిన జీతాలు అందించాలి అని శాసనమండలిలో డిమాండ్ చేశారు. ‌ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా అంగన్వాడీలు ఆశ కార్యకర్తల ఆందోళనలపై కప్పదాట్ల వేస్తున్నారన్నారు. ఐటీడీఏలకు గత ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను నియమిస్తే ఈ ప్రభుత్వం పిఓ, డిడి ఇతర పోస్టులు ఇన్చార్జిలతో కొనసాగిస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుందో ఇప్పటికే బహిర్గతమైంది అన్నారు. సమావేశంలో వంగపండు అప్పలనాయుడు, గిరి రఘు, రెడ్డి సురేష్ సింగారపు ఈశ్వరరావు, పిరిడి రామకృష్ణ, బాలాజీ, కొల్లి రమణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *