జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్
ప్రేమ మూర్తిగా, సేవా స్ఫూర్తిగా భక్తుల మదిలో శ్రీ సత్యసాయి కొలువై ఉంటారని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక పాత బస్టాండ్ వద్ద గల కంచరవీధిలో శ్రీ సత్యసాయి 99వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక చైతన్య దీప్తిగా సత్య సాయి కీర్తించబడ్డారని తెలిపారు. ఆయన సూచించిన మార్గం, ప్రేమ, సేవా అందరికీ అనుసరనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.