కేంద్ర సహాయ మంత్రిని కోరిన విజయనగరం ఎంపీ కలిశెట్టి
కేంద్ర మత్స్య,పశు సంవర్థక, డైరీల శాఖ సహాయ మంత్రి వర్యులు S.P సింగ్ భాగెల్ ను ఆయన నివాసంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిసి గరివిడి పశుసంవర్ధక కళాశాల సమస్యలు తెలియజేశారు. వాటిని పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
అదే విధంగా కళాశాల ఆవరణలో కృషి విజ్ఞాన కేంద్రాన్ని నెలకొల్పవలసినదిగా ఎంపీ అప్పలనాయుడు మంత్రి భాగెల్ కోరడం జరిగింది.