విజయనగరం జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షునిగా విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడును ఎన్నుకున్నారు. అలాగే కార్యదర్శి గా పెనుమత్స సీతారామ రాజు, వైస్ ప్రెసిడెంట్ గా వెంకట లక్ష్మీపతి రాజు, జాయింట్ సెక్రటరీగా దంతులూరి సీతారామ రాజు, కోశాధికారి సూర్య నారాయణ వర్మ, అపెక్స్ మెంబర్ పిన్నింటి సంతోష్ కుమార్, ప్లేయర్ మెంబర్ కొండపల్లి పైడి తల్లి నాయుడు, మహిళా ప్లేయర్ మెంబర్ గా పాకలపాటి విజయలక్ష్మి ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు, కమిటీ సభ్యులను పలువురు ప్రముఖులు అభినందించారు.