పార్వతీపురం మన్యం జిల్లా. సాలూరు మండలం, అంటివలస ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల లో ఫుడ్ పాయిజన్ అయిన 16 మంది విద్యార్థులను ఈరోజు ఏపీ ఎస్టీ కమీషన్ చైర్మన్ డా. డి. వి.జి శంకరరావు పాఠశాలకు వెళ్లి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.. అలానే ఉపాధ్యాయులు, వార్డెన్, ANM, తక్షణమే వారిపై జాగ్రత్త వహించి వారిని హాస్పిటల్ కు తీసుకొని వెళ్ళడం పట్ల అభినందించారు..ఇదివరకు ఆశ్రమ పాఠశాలలో ANM, హెల్త్ వర్కర్స్ కొరకు ఎస్టి కమీషన్ కు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దీనిని కమీషన్ ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళడం వలన I.T.D.A అన్ని ఆశ్రమ పాఠశాలలో ANM లును ప్రవేశపెట్టడం జరిగింది. కావున ప్రభుత్వంకు ఎస్టీ కమీషన్ చైర్మన్ డా.డి.వి.జి శంకరరావు ధన్యవాదాలు తెలియజేశారు… అలానే ATWO శ్రీనివాసురావు, హాస్టల్ ప్రిన్సిపల్,తదితరులు పాల్గొనడం జరిగింది…