మక్కువ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు
పర్చాలని సాలూరు రిటర్నింగ్ అధికారి మరియు పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి. విష్ణు చరణ్ అధికారులను ఆదేశించారు . ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న హార్డింగ్ లను, పోస్టర్లు , కటౌట్లు తదితర ప్రచార సామగ్రి ఉండరాదని ఆయన స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును మంగళవారం మక్కువ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాధమిక ఆరోగ్య కేంద్రంతో సహా వెంకటబైరిపురంలో పరిశీలించారు. శనివారం సాయంత్రం ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ నియమ నిబంధనలను పటిష్టంగా అమలు పర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల నియమావళి అమల్లో ఎటువంటి అలసత్వం వహించారని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.