ఒక్క అవకాశం ఇచ్చినందుకు సైకో పాలనతో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని, సైకోపోతే మళ్లీ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని టిడిపి జనసేన భాజపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు పట్టణంలో సోమవారం సాయంత్రం 15వ వార్డులో సంధ్యారాణి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టించాలంటే తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో అభివృద్ధికి కేరాఫ్ గా చంద్రబాబు ఉన్నారన్నారు. అటువంటి మహానాయకుడు మళ్లీ సీఎం అయితేనే ప్రజలకు రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. యువతకు ఉద్యోగాలు రావాలన్నా, పేదలకు సంక్షేమ పథకాలు అందాలన్నా, అభివృద్ధి పరుగులు పెట్టాలన్న కూటమి విజయంతోనే సాధ్యమన్నారు. పెద్ద కుమ్మరి వీధి, యాత వీధి, గొర్ల వీధి, తదితర ప్రాంతాలలో ప్రచారం నిర్వహించి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ప్రచారానికి వచ్చిన సంధ్యారాణికి వార్డు ప్రజలు హారతులు ఇచ్చి బ్రహ్మరథం పట్టారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చిట్టి, కార్యదర్శి రమణ, టిడిపి నేతలు అక్యాన అప్పారావు, రాధ, జి లక్ష్మణ, శ్రీరాములు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.