లెక్కింపు కేంద్రంను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి

పార్వతీపురం, మార్చి 26 : సాలూరు శాసన సభ నియోజక వర్గం ఓట్ల లెక్కింపు కేంద్రం, స్ట్రాంగ్ రూంలను పార్వతీపురం ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి మరియు సాలూరు రిటర్నింగ్ అధికారి సి విష్ణు చరణ్ మంగళవారం పరిశీలించారు. లెక్కింపు కేంద్రాన్ని పార్వతీపురం ఉద్యాన కళాశాలలో ఏర్పాటు చేయడం జరుగుతుందని, స్ట్రాంగ్ రూం ను సాలూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. లెక్కింపు కేంద్రం, స్ట్రాంగ్ రూం లో అన్ని పక్కాగా ఉండాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఇ వి ఎం స్ట్రాంగ్ రూం ఏర్పాటు, ఎన్నికల సామగ్రి పంపిణీ చేపట్టడం జరుగుతుందని ఆయన చెప్పారు.

ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా నిర్వహణకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, రాజకీయ పార్టీలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎన్నికల అనుమతులకు సువిధ ఆన్లైన్ యాప్ లో కనీసం 48 గంటల ముందుగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. ప్రచారం తదితర ప్రతి అంశానికి సంబంధించి అనుమతులు విధిగా పొందాలన్నారు. అనుమతులను ఆన్లైన్ సువిధ యాప్ ద్వారా తీసుకోవాలని, ఇందుకు కనీసం 48 గంటల ముందుగా దరఖాస్తు చేసుకుంటేనే అనుమతులు లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల డిజిటల్ మీడియా విధానంలో ప్రచారానికి విధిగా అనుమతులు పొందాలని ఆయన చెప్పారు. కరపత్రాలు, పోస్టర్లు, బుక్ లెట్లు తదితర ప్రచార సామగ్రిలో ముద్రణ, ప్రచురణ కర్తలు వివరాలు, ముద్రించిన ప్రతుల సంఖ్య విధిగా తెలియజేయాలని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి విధిగా పాటించాలని వ్యక్తిగత దూషణలు, కుల, మత, ప్రాంతీయ తత్వాలు రెచ్చగొట్టే విధంగా ఉండరాదని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *