పార్వతీపురం మన్యం జిల్లా
సాలూరు పోలింగ్ పటిష్టంగా నిర్వహించాలని పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి మరియు సాలూరు శాసన సభ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి సి. విష్ణు చరణ్ అన్నారు.
సాలూరు నియోజకవర్గ ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు అందిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని విష్ణు చరణ్ సోమవారం తనిఖీ చేశారు. ఎన్నికల ప్రక్రియలో పాటించవలసిన ప్రవర్తనా నియమావళి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధులు నిర్వహన తదితర అంశాలపై అందిస్తున్న శిక్షణను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆర్ ఓ మాట్లాడుతూ…
ఎన్నికల్లో భాగస్వామ్యం అయినందుకు చిత్తశుద్ధితో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని భావించి ఎటువంటి ఆరోపణలు లేకుండా స్వేచ్ఛగా ప్రశాంతంగా జరిగేలా విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో ప్రిసైడింగ్ అధికారులు, సెక్టర్ అధికారులు కీలకమని అన్నారు. ఎక్కడ ఎటువంటి లోపాలు తలెత్తకుండా ఎన్నికలు సక్రమంగా జరిగేందుకు ఏమైనా అనుమానాలు ఉంటే శిక్షణలో పూర్తి స్థాయిలో నివృత్తి చేసుకోవాలని అన్నారు. మాక్ పోలింగ్ మొదలుకొని స్ట్రాంగ్ రూములో ఈవిఎంలు భద్రపరిచే వరకు తీసుకోవలసిన జాగ్రత్తలు , చర్యలపై పలు సూచనలు చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నడుచుకోవాలని అతిక్రమించిన, నిర్లక్ష్యం చూపిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్ పూర్తయిన తరువాత ప్రిసైడింగ్ అధికారి డైరీ రాయడం, ఫారం 17 సి నింపడం వంటి చర్యలపై శ్రద్ద తీసుకోవాలని అన్నారు. బేలట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వివిపాట్ లను కలిపే కేబుల్స్ ఉపయోగించడంలో తగు జాగ్రత్తలు పాటించడం ద్వారా ఇవియం ల మోరాయింపు వంటి అంశాలు ఉత్పన్నం కావని ఆయన స్పష్టం చేశారు. కేబుల్స్ కలపడంలో శిక్షణా సమయంలో పలు మార్లు ఆసక్తి చూపించాలని సూచించారు. సెక్టార్ అధికారులు సైతం పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. పోలింగ్ ప్రక్రియ పైన, ప్రిసైడింగ్ అధికారుల విధులు పైన సెక్టార్ అధికారులకు పూర్తి అవగాహన ఉండాలని, వారికి తలెత్తే సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసే స్థాయిలో ఉండాలని ఆయన అన్నారు. సెక్టార్ అధికారులు ఎన్నికల కమిషన్ కు ఫస్ట్ రెస్పాండర్ గా ఉంటారని ఆయన తెలియజేస్తూ ఆ మేరకు అన్ని విధుల పట్ల అవగాహన ఉండాలని, తగు సమాచారం కలిగి ఉండాలని ఆయన ఆదేశించారు. మాక్ పోలింగ్ ను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్లు, సెక్టార్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.