డీజే లకు అనుమతులు ఇవ్వం

పట్టణ సీఐ వాసు నాయుడు

ప్రజారోగ్యం, శాంతి భద్రతల దృష్ట్యా సాలూరు పట్టణంలో ఏ విధమైన సౌండ్ సిస్టం లకు ,DJ లకు అనుమతులు ఇవ్వబడవని సాలూరు పట్టణ సిఐ సి.హెచ్ వాసు నాయుడు తెలిపారు.

ఆదివారం సాయంత్రం టౌన్ స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా చట్ట వ్యతిరేకంగా పెట్టిన ఏ విధమైన సౌండ్ బాక్స్ ల నైనా సీజ్ చేసి , కేసులు నమోదు చేస్తాం అన్నారు. రాత్రి సమయంలో నిర్దిష్ట సమయం 10 గంటల‌ తర్వాత ఊరేగింపులకు అనుమతించడం జరగదన్నారు.‌ కావున శుభకార్యాలు జరిపించుకునే పట్టణ ప్రజలు ఈ విషయాన్ని ముందుగానే గుర్తెరిగి సాంప్రదాయ పద్ధతిలో కార్యక్రమాలు చేసుకోవాలని కోరారు. పోలీసులకు సహకరించాలని సూచించారు.‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *