పార్వతిపురం మన్యం జిల్లా
సాలూరు పట్టణంలో 12,13,16,17 వార్డుల్లో శ్యామలాంబ గుడి నుండి గొర్లెవీధి, తోటవీధి, బోనువీధి, కర్రివీధి, గాడివీధి, జన్నివీధి, అల్లువీధి, గూడెపువీధి, అక్యానవీధి, శివాజీ సెంటర్ లలో పోలిట్ బ్యూరో సభ్యులు, టీడీపీ – జనసేన – బీజేపీ – కూటమి అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి, రాష్ట్ర ఉపాధ్యక్షులు RP భంజుదేవ్ ఇంటింటికి ప్రచారం చేశారు.
ఈ కార్యక్రమంలో శ్యామలాంబ ఆలయంలో అమ్మవారికి పూజలు చేశారు. ఇంటింటికి ప్రచారంలో భాగంగా బాబు సూపర్ సిక్స్ పథకాలను వివరించారు, కూటమి విజయంతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది కనుకే సైకిల్, కమలం గుర్తులకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో మహిళలు వచ్చి పూలదండలు, హారతులతో స్వాగతం పలికారు. స్థానిక మహిళలు వచ్చి పలు సమస్యలు తెలపగా సంధ్యారాణి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చారు.