విజయవాడ: ఐ ప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ అయ్యారు.
విజయవాడలోని బెంజ్ సర్కిల్లో ఉన్న ఐ ప్యాక్ ఆఫీస్కు చేరుకుని ఆ టీంను కలిసి కృతజ్ఞతలు చెప్పారు.
ఐ ప్యాక్ టీం సభ్యులు జగన్ కు ఘన స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో తన పార్టీ కోసం పనిచేసినందుకు ఐ ప్యాక్ టీం ప్రతినిధులను అభినందించారు . ఈ నేపథ్యంలో పోలీసులు బెంజ్ సర్కిల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మే 17న విదేశీ పర్యటనలో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ లండన్ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో జరిగిన పోలింగ్ శాతం, విజయావకాశాలపై ఐ ప్యాక్ ప్రతినిధులతో చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తమ పార్టీకి విజయావకాశాలు ఏ మేర ఉన్నాయి అనే దానిపై సమాచారం అడిగి తెలుసుకునేందుకు అక్కడకు చేరకున్నారన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ తో పాటు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నారు.
ఐ ప్యాక్ బృందంతో భేటీ సందర్భంగా సిఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.
ఎన్నికల ఫలితాలపై తొలిసారిగా స్పందించిన సీఎం జగన్
జూన్ 4 ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్ అవబోతోంది.
మరోసారి అధికారంలోకి వస్తున్నాం.
22 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం.
2019 కంటే ఎక్కువ అసెంబ్లీ సీట్లు రానున్నాయి.
ప్రశాంత్ కిషోర్ ఊహించిన దానికంటే వైసిపి కి ఎక్కువ సీట్లు.
ప్రజలకు ఈ ఐదేళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తాం.
ఐ ప్యాక్ టీం చేసిన సేవలు వెలకట్టలేనిది.
రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం.
పేరు పేరున ఐ ప్యాక్ టీం సభ్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్న సిఎం జగన్