పార్వతీపురం మన్యం జిల్లా
గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే కే రంగారావు (బేబీ నాయన) పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. ఆదివారం మంత్రి నివాసంలో ఆమెను మర్యాద పూర్వకంగా కలిశారు. అలాగే పోలీస్ అధికారులు, ఉపాధ్యాయ సంఘాలు, పలు శాఖల అధికారులు, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు, ఎంఈవో అసోసియేషన్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం, పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు పల్లి జోగారావు పలువురు మంత్రి సంధ్యారాణి నీ కలిసి అభినందనలు తెలిపారు.