పార్వతీపురం మన్యం జిల్లా
ద్విచక్ర వాహన వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు పార్వతీపురం జిల్లా కేంద్రంలో తమ శాఖను ఏర్పాటు చేయడమైదని వేణుగోపాల సుజుకి షోరూం జనరల్ మేనేజర్ ప్రవీణ్ తెలియజేశారు.
మొట్టమొదటిసారిగా పార్వతీపురం లో నూతనంగా ఏర్పాటు చేసిన సుజుకి ఏసి షోరూం శాఖను ఏరియా సేల్స్ మేనేజర్ పి. వంశీకృష్ణ రెడ్డి, సర్వీసెస్ ఏరియా మేనేజర్ జి. రాజశేఖర్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలు యాక్సెస్ 125, బర్గ్ మెన్, అవెన్యూ, స్కూటీలు మరియు జిక్సర్ మోటార్ సైకిల్ వంటి మోడల్ లను ఎక్కువగా ఆదరిస్తున్నారని. వాటికి సంబంధించిన వినియోగదారులు కూడా ఎక్కువగా ఉండటం వలన వారికి అందుబాటులో ఉండడం కోసం జిల్లా కేంద్రంలో నూతన శాఖను ఏర్పాటు చేయడమైనదని అలాగే సర్వీసింగ్ సెంటర్ కూడా ప్రారంభించినట్లు తెలియజేశారు. కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ జి.అభిరామ్, స్థానిక బ్రాంచ్ సిబ్బంది పాల్గొన్నారు.