విజయనగరం జిల్లా పోలీసు
పోగొట్టుకున్న 118 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన సైబర్ క్రైం పోలీసులు- సోషల్ మీడియా సైబర్ సెల్ సిఐ టి.వి. విజయకుమార్
జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న 120 మొబైల్స్ ను ట్రేన్ చేసి, వాటిని జిల్లా ఎస్పీ ఎం.దీపిక గారి ఆదేశాలతో విజయనగరం సోషల్ మీడియా సైబర్ సెల్ సిఐ టి. వి. విజయకుమార్ జూలై 3న సైబర్ క్రైం పోలీసుస్టేషను వద్ద బాధితులకు అందజేసారు.
ఈ సందర్భంగా సోషల్ మీడియా సైబర్ సెల్ సిఐ టి.వి. విజయకుమార్ మాట్లాడుతూ –
సైబరు సెల్ పోలీసులకు మొబైల్ ఫోన్లు పోయినట్లుగా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మొబైల్స్ ను ట్రేస్ చేసేందుకు సైబరు సెల్ పోలీసులు, సిబ్బంది నిరంతరం చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల గురించి ఫిర్యాదు చేసిన కొద్ది రోజుల్లోనే 118 మొబైల్ ఫోన్లను ట్రేస్ చేసామన్నారు. ఈ ట్రేస్ చేసిన మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ దీపిక పాటిల్ ఆదేశాలతో సైబరు క్రైం పోలీసు స్టేషను వద్ద జూలై 3న బాధితులకు అందజేసామన్నారు. పోయిన మొబైల్స్ గురించిన ఫిర్యాదులను https://www.ceir.gov.in ఆన్ లైను ద్వారాను, సైబర్ క్రైం పోలీసు స్టేషనులోను నేరుగా స్వీకరించి, వాటిని ట్రేస్ చేసి, బాధితులకు అందజేస్తున్నామని సిఐ టివి విజయకుమార్ తెలిపారు.
కొంతమంది నేరస్థులు గంజాయి అక్రమ రవాణ, హత్యలు, ఇతర నేరాలను చేసేందుకు మొబైల్స్ వినియోగించిన తరువాత, ఆయా నేరాల నుండి తప్పించుకొనే క్రమంలో మొబైల్స్ ను పారేస్తారని, అటువంటి మొబైల్స్ ఎవరైనా వాడినట్లయితే పోలీసులు, కోర్టుల నుండి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయన్నారు. కావున, దొరికిన మొబైల్స్ ను స్థానిక పోలీసు స్టేషనులో అప్పగించడం మంచిదని సిఐ టివి విజయకుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు. పొగొట్టుకున్న మొబైల్స్ చాలా తక్కువ వ్యవధిలోనే తిరిగి తమకు అప్పగించిన సైబర్ సెల్ పోలీసులకు, జిల్లాఎస్పీ కు బాధితులు కృతజ్ఞతలు తెలిపి, తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సైబర్ సెల్ ఎస్ఐలు ప్రశాంత్ కుమార్, నజీమా బేగం, సైబర్ సెల్ కానిస్టేబుళ్ళు తిరుపతి, శ్రీనివాసరావు, రాజేష్, శిరీష మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.