సాలూరు: చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలతో వైకాపా నేతల్లో వణుకు పుడుతోందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. గురువారం సాలూరు పట్టణంలోని 18 వ వార్డులో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తెదేపా మేనిఫెస్టో కరపత్రాలను ప్రజలకు అందజేశారు. టిడిపి అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు, మహిళలకు ఆర్థిక భద్రత కల్పిస్తామన్నారు. వైకాపాకు ఒక ఛాన్స్ ఇచ్చినందుకు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారన్నారు. అంతేకాకుండా అభివృద్ధిని 20 ఏళ్లు వెనక్కు నెట్టేసారని ఆరోపించారు. మళ్లీ వైకాపా నేతల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని కోరారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్ష కార్యదర్శులు నిమ్మాది తిరుపతిరావు, ఎన్ వి రమణ, మాజీ కౌన్సిలర్ నూతి రాజేశ్వరి, ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.