పార్వతిపురం మన్యం జిల్లా
ఆయన ఓ పోలీసు అధికారి, నిత్యం పట్టణంలో ట్రాఫిక్ మరియు శాంతిభద్రతల పర్యవేక్షణ లో బిజీ గా ఉంటూ పట్టణంలో యువతి, యువకులకు సైబర్ క్రైమ్, మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తుంటారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సాలూరులో బంగారమ్మ పేట, పిఎన్ బొడ్డవలస మార్గ మద్యలో రోడ్డు పై గుంతలు ఏర్పడటం వలన వాహన దారులకు ప్రమాదాలు జరుగుతాయని గుర్తించి సాలూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు రోడ్డుపై గుంతలో పూడ్చడానికి స్థానిక క్రషర్ యజమానితో మాట్లాడి రోడ్డుపై గుంతలను పూడిపించారు.
రోడ్డుపై గుంతలు పూడ్చినందుకు సాలూరు పట్టణ వాసులు, వాహనదారులు సిఐ అప్పలనాయుడు ను అభినందిస్తున్నారు.