కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అభివృద్ధి, సంక్షేమం గూర్చి వివరించేందుకు ప్రజా వేదిక ప్రభుత్వం నిర్వహిస్తోందని గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలియజేసారు.
ఈనెల 20న సాలూరు -మామిడిపల్లి, 21 మక్కువ – డి శిర్లం, 22 సాలూరు టౌన్ -11 వార్డు, 23 పాచిపెంట- పాంచాలి, 24మెంటాడ – జక్కువ లో ప్రజా వేదిక జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వం చేపట్టనున్న అభివృద్ధి, అమలు చేయనున్న సంక్షేమ పథకాలు, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరిస్తాం అన్నారు.
తాను పాల్గొన్న కార్యక్రమాల్లో మండల నాయకులు పాల్గొని మిగిలిన చోట్ల కూటమి నాయకులు (టిడిపి, బిజెపి, జనసేన) నాయకులు హాజరై ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు కార్యక్రమాలను వివరించాలని కోరారు.