పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పాంచాలి గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని మహిళా శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించారు.
సచివాలయం ఆవరణలో మొక్కలు నాటారు . వందలాది మంది నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు ఆమెను ఓపెన్ టాప్ కారులో ఊరేగించారు. ఊరేగింపులో గజమాలతో సత్కరించారు. ప్రజలకు అభివాదం చేస్తూ ఆమె అందరనీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. కార్యక్రమంలో పాంచాలి సర్పంచ్ యుగంధర్, మండల టిడిపి అధ్యక్షులు పిన్నింటి ప్రసాద్ బాబు, ముఖి సూర్యనారాయణ, కే సురేష్ ఎంపిటిసి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.