Breaking News
బొండపల్లి: కన్న తల్లిదండ్రులను అతి కిరాతకంగా నరికి చంపిన కసాయి కొడుకు.
విజయనగరం జిల్లా బొండపల్లి మండల కేంద్రం ఎస్సీ కోలని లో తల్లిదండ్రులను అత్యంత దారుణంగా కన్న కొడుకే నరికి చంపిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ కలహల నేపథ్యంలో డోల లక్ష్మణ తల్లిదండ్రులు జయలక్ష్మీ, రాము లను కత్తితో నడిరోడ్డుపై నరికి చంపేశాడు. తల్లిదండ్రులను కొడుకే హత్య చేసిన ఘటన గ్రామంలో స్థానికులను బయాందోళనకు గురి చేసింది. జరిగిన సంఘటనపై బొండపల్లి పోలీసులు ఘటన స్తలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు.