ఆడలి వ్యూ పాయింట్ ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే జయకృష్ణ
పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఐటిడిఏ పరిధిలో శుక్రవారం ఉదయం ఆడలి వ్యూ పాయింట్, రెస్టారెంట్, నైట్ క్యాంపింగ్ టెంట్లు ప్రారంభించారు. ఎన్టీఆర్ ఉద్యానవనంలో ‘ఐ లవ్’ సీతంపేట పేరుతో ఫొటో పాయింట్, 5 డీ థియేటర్ ప్రారంభించారు. కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ, ఐటీడీఏ పీవో శ్రీవాత్సవ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.. సీతంపేట పార్కు అభివృద్ధికి రూ.1.50 కోట్లు ముఖ్యమంత్రి మంజూరు చేశా రని, దీంతో మరిన్ని పర్యాటక పనులు చేపట్టడానికి వీలు కలుగుతుందన్నారు. వ్యూ పాయింట్, అలాగే ఫోటో పాయింట్ లో గిరిజనులతో అధికారులు సందడి చేశారు గిరిజన యువతులు సంప్రదాయ నృత్యాలతో ఎంతగానో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఏపీవో .జి.చినబాబు, డీపీవో వై.సతీష్ కుమార్ పాల్గొన్నారు.