ఆన్ లైన్ లో 26వరకు దరఖాస్తులు స్వీకరణ
28న ప్రభుత్వ, 30న ప్రైవేటు ఐటీఐలలో కౌన్సిలింగ్
ప్రభుత్వ, ప్రైవేటు ఐటిఐలలో మిగిలి ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా ప్రభుత్వ ఐటిఐల కన్వీనర్ ప్రిన్సిపాల్ రవికుమార్ ఓ ప్రకటనలో కోరారు. ఈనెల 26వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలన్నారు. 28న ప్రభుత్వ ఐఐటీ 30న ప్రైవేటు ఐటీఐలకు అభ్యర్థులు సర్టిఫికెట్లతోపాటు హాజరై అర్హులైన అభ్యర్థులు ఐటిఐలో చేరవచ్చు అన్నారు.