దత్తత తీసుకున్న పిల్లలను అతి భద్రంగా చూసుకోవాలి
పిల్లలను అమ్మినా, కార్మికులుగా మార్చినా కఠిన చర్యలు
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో గురువారం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని గిరిజన స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రివర్యులు సంధ్యారాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. పిల్లల దత్తత, పెంపకం, తదితర అంశాలపై చర్చించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పిల్లల దత్తత చట్ట ప్రకారం జరగాలని, దత్తత తీసుకున్న పిల్లలను భద్రంగా చూసుకోవాలని మంత్రి సంధ్యారాణి సూచించారు. పిల్లలను అమ్మినా కార్మికులుగా మార్చినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.