జిల్లా సైనిక సంక్షేమాధికారి ఎం.కృష్ణారావు
పార్వతీపురం మన్యం జిల్లాలోని మాజీ సైనికులు, వితంతు మాజీ సైనికుల సంక్షేమం కొరకు తగిన సూచనలు, సలహాలను ఈ నెల 31వ తేదీ లోగా తమకు అందజేయాలని విజయనగరం జిల్లా సైనిక సంక్షేమాధికారి ఎం.కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు సోమ వారం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. మాజీ సైనికులు, వితంతు మాజీ సైనికుల సమస్యల సత్వర పరిష్కారం కొరకు వచ్చే నెల మొదటి వారంలో పార్వతీ పురం మన్యం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా సైనిక బోర్డు సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. కావున జిల్లా సైనిక బోర్డు, పార్వతీ పురం మన్యం ఉపాధ్యక్షులు, సభ్యులు, మాజీ సైనిక సంక్షేమ సంఘాల సభ్యులు తమ సూచనలు, సలహాలను జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయం, విజయనగరం వారికి ఈ నెల 31లోగా లిఖితపూర్వకంగా సమర్పించవచ్చని అన్నారు. లేదా 86888 17946 నెంబరు కు వాట్సాప్, zswovzm@ gmail.com కు మెయిల్ చేయవచ్చని ఆయన ఆ ప్రకటనలో వివరించారు.