అవగాహనతోనే అధిక దిగుబడులు

మావుడి, కందులపథంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మావుడి , కందులపదం రైతు సేవా కేంద్రాల పరిదిలో వ్యవసాయ అనుబంధ శాఖల సమన్వయంతో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. దశపర్ని కషాయం, జిల్లేడు కషాయం తయారీ వాటి వినియోగం వల్ల కలిగే ఉపయోగాలు గురించి రైతులకు మండల వ్యవసాయ అధికారి పి. అనూరాధ వివరించారు. హార్టికల్చర్ ఆఫీసర్ బి. ఝాన్సీ అరటి,ఆయిల్ పామ్, జీడి మామిడి లో తీసుకోవలసిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో ఉన్న ఆవులు , గేదెలు ,గొర్రెలు పెంపకం లో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి రైతులకు పశు వైద్యులు కె. ప్రభాకర రావు అవగాహన కల్పించారు.
రైతులకు సబ్సిడిలో టార్పలిన్స్ మరియు స్ప్రేయర్లు , ట్రాక్టర్ అనుబంధ పరికరాలు సబ్సిడీలో కల్పించమని గ్రామ పెద్దలు అధికారులను కోరారు.
కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్ లు, గ్రామ పెద్దలు, ఎపిసిఎన్ఎఫ్ సిబ్బంది, గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయుకులు , గ్రామ రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *