స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్

అంబేద్కర్ అందరూ ఆదర్శంగా తీసుకోవాలి

అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి సంధ్యారాణి

రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా 4వ వార్డులో  నవభారత రాజ్యాంగ నిర్మాత డా,, బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి సంధ్యారాణి. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ  అంబేద్కర్  రాజ్యాంగాన్ని నిర్మించిన తర్వాత రాష్ట్రంలో గానీ ప్రపంచంలో గానీ ప్రజలు విధంగా ఉండాలి, వారి హక్కులు ఏమిటి, వారి విధులు ఏమిటి ప్రతీ ఒక్కరికీ తెలియచేసే విధంగా మనల్ని మంచి మార్గంలో నడిపించే విధంగా రాజ్యాంగాన్ని నిర్మించారని మంత్రి తెలిపారు.  భారత రాజ్యాంగంలో అందరూ కలసి స్నేహితులుగా, అన్నదమ్ములు వలె మెలగాలని రాజ్యాంగం యొక్క ప్రధాన లక్ష్యం. కులమతాలు లేకుండా వర్ణ, వర్గ విభేదాలు లేకుండా అందరం కలసి భారత దేశ స్వాతంత్ర్య ఫలాలని అందుకోవాలని ముఖ్యంగా అట్టడుగున వున్నటువంటి అణగారిన వర్గాలను బయటకు తీసుకురావాలని ఒక మంచి ప్రయత్నంతో రాజ్యాంగాన్ని పొందుపరిచారని మంత్రి సంధ్యారాణి తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భంజ్ దేవ్,  పట్టణ టిడిపి అధ్యక్షులు చిట్టి, తహసిల్దార్ ఎన్వి రమణ, ప్రసాద్ అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *