ఐసిడిఎస్ అధికారులను ఆదేశించిన కలెక్టర్ శ్యామ్ ప్రసాద్
జిల్లాలో 516 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని, వాటికి మంచి రంగులు వేసి అందంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ సంబందిత అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పెయింటింగ్స్ వేయించి ఉన్నవాటిని మినహాయించి, మిగిలిన కేంద్రాలకు లోపల, వెలుపల నిర్దేశించిన రంగులను వేయాలని పేర్కొన్నారు. గోడలపై బొమ్మలను వేయించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని చెప్పారు. ప్రతి అంగన్వాడీ కేంద్రానికి వెలుపల అందరికీ కనిపించేలా నేమ్ బోర్డ్ ఏర్పాటుచేయాలని, కేంద్రానికి అవసరమైన పర్నిచర్, బోర్డులు ఇతరత్రా సామాగ్రిని పంపిణీచేస్తామని కలెక్టర్ తెలిపారు. పిల్లలు వచ్చి చక్కగా చదువుకునేందుకు మంచి వాతావరణం కల్పించాలని కలెక్టర్ తెలిపార. సమావేశంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి ఎం.ఎన్.రాణి, జిల్లా విద్యాశాఖాధికారి జి. పగడాలమ్మ, ఇతర జిల్లా అధికారులు, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఉపాద్యాయులు, సిడిపిఓలు తదితరులు పాల్గొన్నారు.