సాలూరు మండలం, కరాసవలస పంచాయతీ, దత్తివలస గ్రామ అంగన్వాడి టీచర్ బొమ్మి. బంగారమ్మ( 55) గుండెపోటుకు గురై మృతి చెందారు. విధులు నిర్వహిస్తూ ఆమె మృతి చెందడంతో కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె భర్త గెల్లయ్య గిరిజన సంక్షేమ శాఖ ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఈమెకు ఇద్దరు పిల్లలు పార్థసారథి సౌజన్య. ఈమె మరణంతో దత్తివలస గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.ఐసీడీఎస్ అధికారులు,సాలూరు అర్బన్, రూరల్ అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లు, తదితరులు సంతాపం తెలిపారు.