పాల్గొన్న మంత్రులు సంధ్యారాణి, అనిత, రాంప్రసాద్ రెడ్డి
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, మంత్రి రాంప్రసాద్ రెడ్డి భేటీ అయ్యారు. బెంగళూరు విధాన సౌధలో ముఖ్యమంత్రిని కలిసి మహిళలకు ఉచిత బస్సు పథకంపై చర్చించారు. రాష్ట్రంలో ఉగాది నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం అమలు తీరుపై పరిశీలించి నివేదిక ఇవ్వాలని సీఎం సూచించారు. కర్ణాటక వెళ్ళిన మంత్రుల బృందం అక్కడ పథకం ఏ విధంగా అమలు చేస్తున్నారు తెలుసుకున్నారు అనంతరం ముఖ్యమంత్రితో భేటీ అయి పలు విషయాలపై చర్చించారు.