సాలూరు పట్టణం చిన్న బజారు వద్ద ఘటన
విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ సీతారం పై ఇద్దరు యువకులు దాడి చేశారు. ఈ ఘటన శనివారం సాలూరు పట్టణంలోని చిన్న బజార్ కూడలి వద్ద చోటుచేసుకుంది. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి రామభద్రపురం ఆర్టీసీ బస్సు వెళ్తోంది. రోడ్డు కు అడ్డంగా బైక్ ఉంది తీయండని డ్రైవర్ కోరారు. యువకులు దుర్బాషలాడుతూ ఆర్టీసీ డ్రైవర్ తో వాగ్వాదానికి దిగారు. మాట మాట పెరగడంతో యువకులు తనపై దాడి చేశారని డ్రైవర్ చెప్పారు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఉన్నతాధికారులకు, సంఘ నాయకులకు డ్రైవర్ ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా పట్టణ పోలీసులు కూడా కంప్లైంట్ చేశారు. ఎఎస్ఐ వలీషా, పోలీసులు రంగంలోకి దిగి యువకులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు. విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ పై దాడికి పాల్పడిన యువకులపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘ నాయకులు డిమాండ్ చేశారు.