స్వచ్ఛతపై గర్భిణులకు అవగాహన

సాలూరు వై టి సిలో‌ని‌ గిరి శిఖర గ్రామాల గర్భిణుల వసతి గృహంలో స్వచ్చత హి సేవ కార్యక్రమాన్ని  నీడ్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ వేణుగోపాల్ రావు నిర్వహించారు.

  • పరిశుభ్రత లేకపోతే  ఆరోగ్యం ముప్పులో పడుతుందని వ్యాధులు విస్తరించడానికి కారణమవుతుంది నీడ్ డైరెక్టర్ వివరించారు. రోజువారి జీవితంలో పరిశుభ్రతతో కూడిన ఆచరణ అవసరం అన్నారు.
  • బహిరంగ మలవిసర్జన వ్యాధులను వ్యాపింపజేస్తుందన్నారు. నీటిని పరిసరాలను కాలుష్యం చేస్తుంది.  ఇది మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది కాబట్టి, జాగ్రత్తలు పాటించాలి అన్నారు.
  • చెత్తను సరిగ్గా నిర్వర్తించడం మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
  • స్వచ్ఛత అనేది ఆరోగ్యకరమైన జీవితానికి, పరిశుభ్ర ఆహారానికి, మంచి నీటి వనరులకు అనుసంధానమై ఉంటుందన్నారు. అందరూ పరిశుభ్రత పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు కార్యక్రమంలో వై టి సి మేనేజర్ విద్యాసాగర్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *