ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పట్టణ సీఐ బి. అప్పలనాయుడు అన్నారు. మంగళవారం పట్టణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హెల్మెట్ దారణపై యువజన సర్వీసుల శాఖ సెట్విజ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు యువతకు హెల్మెట్ ధరించడం పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎం వి ఐ ప్రసాద్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.