పట్టణ సీఐ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
సాలూరు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బాల్య వివాహాలు, మహిళా చట్టాలు, గంజాయి, సైబర్ నేరాలపై టౌన్ సీఐ బి. అప్పలనాయుడు మంగళవారం అవగాహన కల్పించారు. ఛాయా చిత్రాలు ప్రదర్శించారు. విద్యార్థినులకు సంపూర్ణ అవగాహన వచ్చేలా చిత్రాలను చూపుతూ సీఐ వివరించారు. సమస్య ఎదురైనప్పుడు పోలీసులకు ఏ విధంగా సమాచారం ఇవ్వాలో టోల్ ఫ్రీ నంబర్లను తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.