మంత్రి పార్థసారథి మీడియా సమావేశం :
నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయం – సగటు మద్యం ధర రూ.99 నుంచి అందుబాటులో ఉంచాలని నిర్ణయం – భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం – పంట నష్టపరిహారం కౌలు రైతులకు దక్కేలా చూడాలని నిర్ణయం – వరదముంపు సాయం యజమానులకు కాకుండా అద్దెకు ఉండేవారికి ఇవ్వాలని నిర్ణయం – మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం – వాలంటీర్ల వ్యవస్థపై మంత్రివర్గం సమావేశంలో సుదీర్ఘ చర్చ – వాలంటీర్లను, సచివాలయాలను వివిధ శాఖల్లో కలిపేలా చర్యలు – 1.07 లక్షల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు – ప్రస్తుతం 1.10 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు – ప్రభుత్వం వాలంటీర్లుపైనే నడుస్తుందని వైసీపీ చెబుతూ ఉండేది – 2023లో వాలంటీర్ల పదవీకాలం గడువు ముగిసినా రెన్యువల్ చేయలేదు – దినపత్రికల కొనుగోలుకు నెలనెలా వాలంటీర్లు, సచివాలయాలకు రూ.200 ఇచ్చేవారు – దినపత్రికల కొనుగోలుకు ప్రస్తుతం నెలనెలా ఇస్తున్న రూ.200 రద్దు – ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ‘స్టెమీ’ పథకాన్ని ప్రారంభిస్తాం – ఆధార్ తరహాలో విద్యార్థులకు ‘అపార్’ గుర్తింపు కార్డులు తీసుకురాబోతున్నాం – ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం – హోంశాఖలో కొత్త కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తాం – కొత్త కార్పొరేషన్‌కు రూ.10 కోట్ల కార్పస్ పంఢ్‌ను ఇస్తాం – గత ప్రభుత్వం ఎస్ఆర్ఎం వర్సిటీని అనేక ఇబ్బందులకు గురి చేసింది – ఎస్ఆర్ఎం వర్సిటీకి డీమ్డ్ హోదా ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం – విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకే ఎస్ఆర్ఎం వర్సిటీకి డీమ్డ్ హోదా – రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో బిట్స్ పిలానీ వర్సిటీకి చర్యలు – విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యం – బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రానికి సిఫార్సు చేశాం – బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లపై కేంద్రానికి సిఫార్సు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది – కౌలుకార్డుల నమూనాను మార్చాలని కేబినెట్ నిర్ణయించింది – రైతు సంతకం అవసరం లేకుండానే కార్డులు జారీ చేస్తామని మంత్రి ప్రకటించారు.