నివాళి అర్పించిన మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర
గిరిజనుల అభ్యున్నతికై కృషి చేసి, బ్రిటిష్ అరాచకాలను ఎదిరించిన ఆదివాసీ యోధుడు,తన పోరాట పటిమతో ఆంగ్లేయులకు చెమటలు పట్టించి, చిన్న వయసులోనే ప్రాణాలు అర్పించిన గిరిజన నాయకుడు,స్వాతంత్ర్య సమర ఆదివాసీ యోధుడు భగవాన్ బిర్సాముండా అని మాజీ ఉప ముఖ్యమంత్రి పి. రాజన్న దొర అన్నారు. ఆయన నివాసంలో శుక్రవారం బిర్సా ముండా జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. స్వాతంత్ర పోరాటంలో ఆయన పాత్ర, గిరిజనుల అభివృద్ధికి బిర్సా ముండా చేసిన సేవలు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సాలూరు అర్బన్, రూరల్ ప్రజాప్రతినిధులు,వైసీపీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.