ఈసారి నన్ను ఆశీర్వదించండి
మెంటాడ మండలం- గురమ్మవలస, బుచ్చిరాజుపేట గ్రామాలలో జరిగిన ఇంటింటికి ప్రచారం కూటమిఅభ్యర్ధి గుమ్మిడి సంధ్యారాణి నిర్వహించారు.
గ్రామంలో మహిళలు హారతులు ఇచ్చి గుమ్మిడి సంధ్యారాణి కి స్వాగతం పలికారు.
గురమ్మవలస, బుచ్చిరాజుపేట గ్రామాలలో సంధ్యారాణి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని నియోజకవర్గంలో టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. అనంతరం చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను వివరించి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చెలుమూరి వెంకట్రావు , గెద్ద అన్నవరం, సర్పంచ్ తాడ్డి తిరుపతి, ఎంపీటీసీ ఎర్రి నాయుడు, ముసలి నాయుడు, గురు నాయుడు, గుమ్మిడి సింహాచలం, సత్యం, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.