మీకే మేము వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
రక్తదానం చేసిన 32 మంది దాతలు
రక్తదానం చేసి ప్రాణాలు నిలపాలని పట్టణ సీఐ అప్పలనాయుడు అన్నారు. స్వతంత్ర సమరయోధులు భగత్ సింగ్ జయంతి సందర్భంగా మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్, నవోదయ సేవా సమితి ఆధ్వర్యంలో సాలూరు పట్టణం లో రక్తదాన శిబిరం నిర్వహించగా టౌన్ టిడిపి అధ్యక్షుడు ఎన్ . తిరుపతి రావు ప్రారంభించారు. .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సాలూరు పట్టణ సిఐ అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి రక్తం చాలా అవసరం ఉందని అలాంటి వారి కోసం ఎప్పటికప్పుడు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తే బాగుంటుందని అన్నారు.అలాగే యువతీ యువకులు ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించి స్వచ్ఛందంగా రక్తం దానం చేయడానికి ముందుకు రావాలని సూచించారు. అలాగే యువత ఇలాంటి సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించి సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలన్నారు. యువత చెడు మార్గంలో వెళ్లకుండా ఇలాంటి మంచి మార్గాల్లో ప్రయాణిస్తే ఈ సమాజంలో ఆదర్శవంతులుగా ఉంటారని అన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు ఇప్పిలి దిలీప్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి రక్తదాన శిబిరాలు ఇప్పటివరకు 8 నిర్వహించడం జరిగింది.ప్రతి రక్తదాన శిబిరంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారని చెప్పారు. రక్త నిధి సేకరణ చేయడంలో భాగస్వామ్యులు అయ్యారు.ఈ రక్తదాన శిబిరంలో రక్త నిధి 32 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారన్నారు. .ఈ కార్యక్రమానికి హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ సహాయ సహకారాలు అందించారు. ఈ రక్త నిధి విజయనగరం ఎన్ వి యన్ బ్లడ్ బ్యాంకుకు అందించడం జరిగింది .ఈ కార్యక్రమంలోటిడిపి పట్టణ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు,కూనిశెట్టి బీమా,గౌడ ఈశ్వరరావు, వి.చంటి,ఆర్ జయప్రకాష్,కె వినయ్, వసంత కుమార్ పాల్గొన్నారు.