గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి
ప్రజాసేవకుడు నిరంతర శ్రామికుడు పని రాక్షసుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని గిరిజన మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం కోన పంచాయతీ గోపాలపురం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
గత ప్రభుత్వం పంచభూతాలతో ఆడుకుంది. అందుకే 151 సీట్లలో 5 పోయి, 11 సీట్లు మాత్రమే మిగిలాయి. మూడుసార్లు సీఎంగా 2,34,000 టీచర్ పోస్టులు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదే అన్నారు. నాలుగోసారి సీఎం అయిన వెంటనే మెగా డీఎస్సీతో 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నారన్నారు. స్కిల్ డెవలప్మెంట్లతో శిక్షణలు ఇచ్చి జిల్లాలో 470 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించమన్నారు. నియోజకవర్గంలో ప్రతి పల్లెకు పట్టణంలోని వార్డులకు తారు, సిసి రోడ్లు వేయించే బాధ్యత నాది అన్నారు. ప్రజల సమస్యలన్నీ తీర్చే బాధ్యత ప్రభుత్వానికి అన్నారు ప్రజల కష్టం చంద్రబాబు కష్టంగా భావించి వరదలలో ప్రాణాలకు తెగించి సేవలందించిన మన ముఖ్యమంత్రి చంద్రబాబుకు మనమందరము కృతజ్ఞులమన్నారు.. నియోజకవర్గంలో తాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పనకు అధికారులు ఎప్పటికప్పుడు ప్రతిపాదనలు చేసి ఎటువంటి అడ్డంకులు లేకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి డిఎఫ్ఓ ప్రసూన, మండల అధ్యక్షులు గుల్ల వేణు గోపాల్ నాయుడు, జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ రిషివర్ధన్, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.