అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్న వారికి, అభాగ్యులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి మంజూరు చేసి కూటమి ప్రభుత్వం ఆదుకుంటోందని మహిళ శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మంగళగిరిలోని మంత్రి కార్యాలయంలో పలు జిల్లాల నుంచి వచ్చిన వారినుంచి వినతులు స్వీకరించారు. అనంతరం పలువురికి మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను మంత్రి అందజేశారు. అభివృద్ధి, సంక్షేమంతో పాటు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయం అన్నారు.