సామాన్యులకు సరసమైన ధరలకే నిత్యావసర సరకులు అందించడమే ప్రభుత్వ ధ్యేయం అని మాజీ ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.పి భంజ్ దేవ్ అన్నారు. పెరుగుతున్న ధరలతో పేదలపై భారం పడకూడదని ప్రభుత్వం రైతుబజార్లు పెద్ద సంస్థాగత రిటైల్ దుకాణాల వద్ద సరసమైన ధరలతో నాణ్యమైన సరుకులు విక్రయించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. శుక్రవారం పట్టణంలోని చిన్న బజారు ప్రధాన రహదారిలోని స్మార్ట్ పాయింట్ వద్ద పామాయిల్ విక్రయ కేంద్రాలు ప్రారంభించారు పామాయిల్ మార్కెట్ ధర 122 ఉండగా 110 రూపాయలకి, సన్ ఫ్లవర్ ధర 132 కాగా , 124 రూపాయలకి ప్రభుత్వం అందజేస్తుంది అన్నారు. ప్రజలకు కనీస ధరలకు కంది పప్పు, పామాయిల్ విక్రయిస్తున్నారని టిడిపి అధ్యక్షుడు నిమ్మాది చిట్టి అన్నారు. ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ ఎన్ వి రమణ కోరారు. సీఎస్ డీటి రంగారావు, కౌన్సిలర్ శైలజ, శోభారాణి, చిన్ని, డబ్బి కృష్ణ, అప్పయ్యమ్మ, కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు.