టీటీడీ అధికారులతో పద్మావతి అతిథి గృహంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షకు మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, టీటీడీ ఈవో, అదనపు ఈవో, వివిధ విభాగాల అధికారులు హాజరయ్యారు.
తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ఇక్కడ ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని, ప్రశాతంతకు ఎక్కడా భంగం కలగకూడదు…ఏ విషయంలోనూ రాజీ పడొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. భవిష్యత్ నీటి అవసరాలకు తగ్గట్లు నీటి లభ్యత ఉండేలా ముందస్తు ప్రణాళిక చాలా అవసరం అని పేర్కొన్నారు. అటవీ ప్రాంత విస్తీర్ణం 72 నుంచి 80 శాతంపైగా పెంచాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.