కేంద్ర మంత్రులు కుమారస్వామి, నితిన్ గడ్కరీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. సీఎం అధికారిక నివాసానికి వచ్చిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి తో సెయిల్‌లో విశాఖ స్టీల్‌ప్లాంట్ విలీనంపై కీలక చర్చలు జరిపారు. అలాగే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. ఏపీలోని రహదారుల ప్రతిపాదనలు, కావాల్సిన నిధులు గురించి కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. ఇద్దరు మంత్రులు సానుకూలంగా స్పందించారు. ఈ భేటీలో ఎంపీలు, ప్రముఖులు పాల్గొన్నారు.