లెజెండరీ క్రికెటర్,ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ కపిల్ దేవ్ అతని ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అయ్యారు. అమరావతిలో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్స్ క్లబ్ ,అనంతపురం ,వైజాగ్‌లలో ప్రీమియర్ గోల్ఫ్ కోర్స్ క్లబ్‌లను ఏర్పాటు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించి, ఆంధ్రప్రదేశ్ క్రీడా రంగాన్ని విస్తరించడం గురించి చర్చించారు. యువతలో గోల్ఫ్ పట్ల మక్కువను పెంపొందిస్తుంది తదుపరి తరం గోల్ఫ్ క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మన పౌరులకు ఇలాంటి మరిన్ని అవకాశాలు, సౌకర్యాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌ను క్రీడా నైపుణ్యానికి నిజమైన హబ్‌గా మార్చడానికి క్రీడా చిహ్నాలతో సహకరించడానికి మేము ఎదురుచూస్తున్నామని కపిల్ దేవ్, బృందం అనడంతో సీఎం ఎంతో ఆనందించారు.