ఎమ్మెల్యే బేబీ నాయన, మాజీ మంత్రి సుజయ్ కృష్ణలను అభినందించిన సీఎం చంద్రబాబు
విజయవాడ వరద భాధితుల కోసం సేకరించిన విరాళం 71లక్షల 50వేల 250 రూపాయల చెక్కును ముఖ్య మంత్రి నారాచంద్రబాబు నాయుడుకి బొబ్బిలి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్ వి వి ఎస్ కే రంగారావు (బేబీ నాయన) విజయవాడలో అందజేశారు. భారీ మొత్తంలో విరాళాలు సేకరించిన బేబీ నాయనను సీఎం చంద్రబాబు అభినందించారు. పేదలను వరద బాధితులను ఆడుకోవడంలో ఎల్లప్పుడూ ముందుండే ఎమ్మెల్యే బేబీ నాయన, మాజీ మంత్రి వర్యులు శ్రీ సుజయ్ కృష్ణ రంగారావును ముఖ్యమంత్రి అభినందించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్ముంనాయుడు పాల్గొన్నారు.